![]() |
![]() |
.webp)
స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -273 లో.....ప్రేమ గురించి ధీరజ్ మాట్లాడిన మాటలకి వేదవతి నర్మద చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. వేదవతి అయితే అందరు వెళ్ళాక విజిల్ వేస్తూ నర్మదతో కలిసి డాన్స్ చేస్తుంది. నాకు చాలా సంతోషంగా ఉంది ప్రేమపై ధీరజ్ కి ఎక్కడో ఓ మూలన ప్రేమ ఉందని ఇద్దరు అనుకుంటారు.
మరొకవైపు ధీరజ్ వంక ప్రేమ చూస్తుంది. అతను అన్న మాటలు గుర్తుచేసుకొని హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇద్దరికి భోజనం తీసుకొని వచ్చి తినమంటుంది. నేను తిననని ధీరజ్ అంటుంటే.. నువ్వు తినకపోతే నేను తిననని ప్రేమ అంటుంది. దాంతో ధీరజ్ తింటాడు. నేను ఒకటి అడుగుతున్నా చెప్పు.. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావ్ కదా అని అడుగుతుంది. నువ్వు వాళ్ళతో అలా మాట్లాడుతుంటే నన్ను సేవ్ చెయ్యడానికి అనుకున్నాను కానీ నీ కళ్ళలో ప్రేమ కనిపించిందని ప్రేమ అంటుంది. ధీరజ్ సైలెంట్ గా ఉంటాడు. నాకు తెలుసు నువ్వు నన్ను లవ్ చేస్తున్నావ్.. లేదని గట్టిగా అరిచేవాడివి అని ప్రేమ అనుకుంటుంది.
ఆ తర్వాత ప్రేమ సిగ్గుపడుతూ గోడపై ధీమా అని రాస్తుంది. అది చూసి ఏంటని ధీరజ్ అడుగుతాడు. ప్రేమ నవ్వుకుంటుంది. మరొకవైపు నా కూతురుపై అలాంటి నిందలు వేస్తారా.. వాళ్ళ సంగతి చెప్పాలని సేనాపతి అంటుంటే అవసరం లేదు ఆల్రెడీ ఆ రామరాజు సంగతి చెప్పే పనిలో ఉన్నానని విశ్వ అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |